RRR Movie Update: ఇక రెండు పాటలే... ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఓవర్

Rajamouli Says RRR Shooting Completed Except 2 Songs and Released Ram Charan Jr Ntr Poster on Same Bike
x

RRR Movie New Poster Released:(Twitter)

Highlights

RRR Movie Update: ఈ మధ్య ఎలాంటి అప్ డేట్ లేదని పీలవుతున్న ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్

RRR Movie Update: బాహుబలి ఏళ్ల తరబడి తీసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని మాత్రం కోవిడ్ అడ్డొచ్చినా సరే.. కంప్లీట్ చేసేసినట్లు వార్తలొస్తున్నాయి. రెండు పాటలు మినహా షూటింగ్ అయిపోయిందనే వార్త ఇప్పుడు అభిమానులకు సెలెబ్రేషన్స్ లో ముంచేస్తోంది. తారక్, చెర్రీ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దసరా కంటే ముందే వస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఈ మధ్య ఎలాంటి అప్ డేట్ లేదని పీలవుతున్న ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దాంట్లో ఎన్టీఆర్ బైక్ నడుపుతుంటే.. రాంచరణ్ వెనక కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ పోస్టర్ చూడటానికి రెండు కళ్లు చాలటం లేదంటున్నారు ఫ్యాన్స్. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి గ్యారంటీ హిట్ మూవీ కావడంతో... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలోనే అభిమానుల గుండెలను తాకబోతుందీ ఈ హై పవర్ ఓల్టేజ్ మూవీ.


Show Full Article
Print Article
Next Story
More Stories