మార్వెల్ తరహా సినిమాలు తీసే ఆలోచన లేదని అంటున్న రాజమౌళి

Rajamouli Says He Has No Plans To Make Marvel-Style Films
x

మార్వెల్ తరహా సినిమాలు తీసే ఆలోచన లేదని అంటున్న రాజమౌళి

Highlights

Rajamouli: మార్వెల్ సినిమాలను ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఆస్వాదిస్తాను అంటున్న రాజమౌళి

Rajamouli: దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి రెండు దశాబ్దాలు గడిచినా ఎస్.ఎస్.రాజమౌళి ఖాతా లో ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు. ప్రతి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ లు అందుకుంటూ వచ్చిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్నారు. బాహుబలి సినిమా తోనే టాలీవుడ్ స్థాయి ని పెంచిన రాజమౌళి తాజాగా విడుదలైన "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో మరొకసారి చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ లను అందుకుంటున్న రాజమౌళి ని హాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడగగా రాజమౌళి సున్నితంగా నో అనేశారు. తనకి భారతీయ పురాణాలు ఇక్కడ సంస్కృతి మీద చాలా అవగాహన ఉందని ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీస్తూ వచ్చానని అదే తనకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన విషయం అని అన్నారు రాజమౌళి.

మార్వెల్ తరహా సినిమాలు తన ఆలోచనలకి కూడా తగవని అన్న రాజమౌళి అలాంటి సినిమాలను ఒక ప్రేక్షకుడిగా మాత్రమే బాగా ఆస్వాదించగల నని చెప్పారు. ఇకముందు కూడా భారతీయ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇక్కడ ఇతివృత్తాలతో సినిమాలు తీస్తానని వీలైతే వాటినే మార్వెల్ తరహాలో తీర్చిదిద్దుతానని అని చెప్పటం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories