"ఆర్ ఆర్ ఆర్" కంటే "బాహుబలి 2" పెద్ద హిట్ అయింది అంటున్న రాజమౌళి

Rajamouli Says Bahubali 2 Movie is a Bigger Hit Than RRR Movie
x

"ఆర్ ఆర్ ఆర్" కంటే "బాహుబలి 2" పెద్ద హిట్ అయింది అంటున్న రాజమౌళి 

Highlights

* "ఆర్ ఆర్ ఆర్" కంటే "బాహుబలి 2" పెద్ద హిట్ అయింది అంటున్న రాజమౌళి

Rajamouli: మొదట "బాహుబలి 1", తర్వాత "బాహుబలి 2" ఆ వెంటనే "ఆర్ఆర్ఆర్". ఇలా వరుసగా బ్లాక్బస్టర్ సినిమాలతో రాజమౌళి బిజీగా ఉన్నారు. తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ వస్తున్నారు రాజమౌళి. అయితే వరుసగా పాన్ ఇండియన్ సినిమా షూటింగ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన రాజమౌళికి ఎట్టకేలకు కొంచెం విశ్రాంతి దొరికింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా మొదలుపెట్టేముందు ముందు రాజమౌళి ఒక చిన్న విరామం తీసుకున్నారు.

అయినప్పటికీ అప్పుడప్పుడు మీడియాతో ముందుకి వస్తూనే ఉన్నారు రాజమౌళి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" సినిమా కంటే "బాహుబలి 2" పెద్ద హిట్ అయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో పోలీస్తే "బాహుబలి 2" సినిమా గురించి ఎక్కువ మంది ఫారిన్ ప్రేక్షకులు మాట్లాడుకున్నారని అన్నారు రాజమౌళి.

అయితే విడుదలైన మొదటి రోజే 233 కోట్లు కలెక్షన్లు నమోదు చేసుకున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా "బాహుబలి 2" రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఫైనల్ రన్ లో "బాహుబలి 2" 510 కోట్లు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకోగా "ఆర్ ఆర్ ఆర్" కలెక్షన్లు ఇంకా 495 కోట్ల వద్దే ఉంది. అయితే ఫైనల్ రన్ పూర్తయ్యే లోపల "ఆర్ ఆర్ ఆర్" ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories