'RRR' కథేంటో వెల్లడించిన రాజమౌళి!

RRR కథేంటో వెల్లడించిన రాజమౌళి!
x
Highlights

'బాహుబలి' సినిమా తరువాత జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి కనుక 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి...

'బాహుబలి' సినిమా తరువాత జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి కనుక 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా కథ గురించి మరియు ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ల గురించి బోలెడు పుకార్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ రాజమౌళి అండ్ టీం ఇవాళ ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. ఈ సినిమా కథ గురించి క్లారిటీ ఇస్తూ రాజమౌళి ఈ సినిమా 1920 నడుస్తుందని చెప్పారు.

దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల్లో ప్రజలకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయని వాటిని ఆధారంగా చేసుకొని ఒక్క కల్పితమైన కథే 'ఆర్ ఆర్ ఆర్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇద్దరు స్వాతంత్ర్యం గురించి పోరాటం మొదలు పెట్టక ముందు ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత జరిగిన విషయాల పై ఈ సినిమా కథ ఉంటుందట. అల్లూరి సీతా రామరాజు పాత్ర రామ్ చరణ్ పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తారీఖున 10 భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories