అనుకున్న టైంకే RRR... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

అనుకున్న టైంకే RRR... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
x
Rajamouli (File Photo)
Highlights

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్...

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్... తాజాగా సినిమాకి సంబంధించిన టైటిల్(రౌద్రం రణం రుధిరం) ని, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అందరికి బిగ్ సప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి.. ఈ చిత్ర మోష‌న్ పోస్టర్ కూడా ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో సినిమా మరోసారి వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే కరోనా ప్రభావం వలన అన్ని షూటింగ్లు ఆగిపోయాయి. RRR కూడా షూటింగ్ వాయిదా పడింది. దీనితో సినిమా మరింత ఆలస్యం కానుందని అనుకున్నారు అంతా.. కానీ నిన్న విడుదల చేసిన పోస్టర్లో సినిమాని అనుకున్న టైంకే అంటే వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తుందట!

ఇక ఈ సినిమాలో అలియా భట్ ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ ఇస్తూ పోస్టర్ లో అలియా పేరును కూడా చేర్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories