RRR, Acharya Movie Updates: ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలపై కరోనా ఎఫెక్ట్

RRR, Acharya Movie: (File Image)
RRR, Acharya Movie Updates: 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్' సినిమాలపై కరోనా ఎఫెక్ట్ పడింది.
RRR, Acharya Movie Updates: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. తనా,మనా బేధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ నాయకులు ఇలా ఎవ్వరినీ వదలడం లేదు ఈ మహమ్మారి. దేశవ్యాప్తంగా రెండో దశలో ప్రతీ రోజు లక్షలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ఈ మహ్మమారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టిడికి రాష్ట్రాలు ఎంత గట్టి చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. రెట్టింపు వేగంతో కరోనా వ్యాప్తి అవుతోంది. దీంతో పలు రాష్ట్రాలు స్వయం లాక్ డౌన్ విధించుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాలు రాత్రి కర్య్ఫు పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కొన్ని సినిమాల విడుదలను.. షూటింగ్ దశలో ఉన్నసినిమాల షూటింగ్‌లను వాయిదా వేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు ఇందకు మినహాయింపు కాదు. కరోనా ముందు ఎంత బడా సినిమా అయినా తల వంచాల్సిందే. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సినీ పరిశ్రమను కరోనా మరోసారి చిన్నాభిన్నం చేస్తుంది. ఇటీవల క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాలతో జోష్ మీదున్న దర్శకనిర్మాతలకు కరోనా మళ్లీ వణుకుపుట్టిస్తోంది.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి భారిన పడగా.. కొన్ని సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి కారణంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట'.. నాగచైతన్య నటిస్తున్న థ్యాంక్యూ, గోపిచంద్-మారుతి సినిమాలు తమ షూటింగ్‌లను వాయిదా వేసుకన్నాయి. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆచార్య', దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలు కూడా చేరాయి. చిత్రయూనిట్ లో ఒకరికి కరోనా సోకగా.. మరింత ఆలస్యం చేయకుండా.. షూటింగ్‌ను నిలిపివేస్తే బాగుంటుందని నిర్మాతలతో పాటు రాజమౌళి కూడా భావించారట. అందుకోసం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఆచార్య సెట్‌లోనూ మహమ్మారి ప్రభావం గట్టిగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ని కూడా నిలిపివేశారని తెలుస్తోంది.
ఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMT
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTపంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు
28 May 2022 6:39 AM GMTMinister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు...
28 May 2022 6:23 AM GMT