మహేష్ బాబు కోసం అదిరిపోయే పాత్ర సెట్ చేస్తున్న రాజమౌళి

Rajamouli Is Setting An Exciting Role For Mahesh Babu
x

మహేష్ బాబు కోసం అదిరిపోయే పాత్ర సెట్ చేస్తున్న రాజమౌళి 

Highlights

* హనుమంతుడి ఆధారంగా మహేష్ బాబు పాత్ర తీర్చిదిద్దుతున్న రాజమౌళి

Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళి పేరు మారుమ్రోగి పోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా లభించడంతో రాజమౌళితో సినిమాలు చేయడానికి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని పూర్తి చేసుకున్న తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా అడవి బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, ఇది ఒక అడ్వెంచర్ డ్రామా అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు కోసం రాజమౌళి ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని రాసుకున్నారట. తాజాగా సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమాలో మహేష్ బాబు పాత్ర హనుమంతుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుంది అని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్ బాబు అదిరిపోయే స్టంట్ లు కూడా చేయబోతున్నారట. స్వయానా రాజమౌళి తండ్రి మరియు ప్రముఖ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి ఒక పవర్ఫుల్ కథని అందించారు.

మహేష్ బాబు పాత్ర గ్రాఫ్ కూడా రామాయణంలో హనుమంతుడి లాగానే ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి కి రామాయణం మరియు మహాభారతం అంటే ఎంతో అభిమానం. ఈ నేపథ్యంలోనే రాజమౌళి మహేష్ బాబు పాత్రని హనుమంతుడి లాగా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని సమాచారం. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories