Top
logo

హాలీవుడ్ బ్యూటీ స్థానంలో 'సాహో' పిల్ల

హాలీవుడ్ బ్యూటీ స్థానంలో సాహో పిల్ల
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మొట్టమొదటిసారి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 'ఆర్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మొట్టమొదటిసారి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్' పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా ప్యాన్-ఇండియన్ మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ప్రెస్ మీట్ ద్వారా రాజమౌళి ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ మరియు ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గర్ జోన్స్ కనిపిస్తారని రివీల్ చేశారు. కానీ ఈ మధ్యనే కొన్ని కారణాలవల్ల డైజీ ఈ చిత్రంలో భాగం కాలేక పోతున్నానని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మరి ఇప్పుడు ఆమె స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సరసన నటించేందుకు రాజమౌళి ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ 'సాహో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని కూడా అడిగినట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరూ కూడా కుదరదు అని చెబితే ఈ పాత్ర కోసం మళ్ళీ వెతుకులాట మొదలవుతుంది. మరోవైపు గాయపడిన రామ్ చరణ్ త్వరలో షూటింగ్ సెట్స్ కి హాజరవ్వనున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై లో విడుదల కానుంది.


లైవ్ టీవి


Share it
Top