Rajamouli: మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ రైటర్ ని మార్చిన రాజమౌళి

Rajamouli: మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ రైటర్ ని మార్చిన రాజమౌళి
Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ కోసం విజయేంద్ర ప్రసాద్ ను వద్దనుకున్నారట. చాలా మంది స్టార్ హీరోలందరూ సినిమాలు అదే కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తూ ఉండటంతో రాజమౌళి ఈసారి కొత్తగా ట్రై చేయాలి అనుకున్నారట.
ఈ నేపథ్యంలోనే "గూడచారి 116" సినిమా ఫేమ్ కృష్ణ ను సంప్రదించారు. రాజమౌళి మహేష్ బాబు తో ఒక స్పై థ్రిల్లర్ చేయాలని అనుకున్నారు. కానీ మరోవైపు ప్రభాస్ కూడా త్వరలో స్పై థ్రిల్లర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అఖిల్ "ఏజెంట్" కూడా అదే కాన్సెప్ట్ తో వస్తోంది. అందుకే మళ్లీ అలాంటి కథ తీసుకోవడం ఇష్టం లేక రాజమౌళి ఈసారి ఒక భిన్నమైన కథని ఎంపిక చేయాలనుకుంటున్నారట. మరి కృష్ణ రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా కోసం ఎలాంటి కథని సిద్ధం చేస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMT