Raja Saab: టికెట్ రేట్ల పెంపు.. తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్! రేట్లు ఎంతంటే?

Raja Saab: టికెట్ రేట్ల పెంపు.. తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్! రేట్లు ఎంతంటే?
x
Highlights

రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ రేట్ల పూర్తి వివరాలు మరియు కార్మికుల సంక్షేమ నిధి నిబంధనలు.

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ ఈరోజు (జనవరి 9) గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇస్తూ జీవో (GO) జారీ చేసింది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ భారీ చిత్రానికి ఆర్థికంగా ఊతమిచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పెరిగిన కొత్త ధరల వివరాలు:

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లలో పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

1. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో:

తొలి 3 రోజులు (జనవరి 9 - 11): ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ. 105 వరకు పెంచుకోవచ్చు.

తర్వాతి 7 రోజులు (జనవరి 12 - 18): ఒక్కో టికెట్‌పై రూ. 62 వరకు అదనంగా వసూలు చేయవచ్చు.

2. మల్టీప్లెక్స్ థియేటర్లలో:

తొలి 3 రోజులు (జనవరి 9 - 11): ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ. 132 వరకు పెంచుకునే వెసులుబాటు.

తర్వాతి 7 రోజులు (జనవరి 12 - 18): ఒక్కో టికెట్‌పై రూ. 89 వరకు అదనపు బాదుడు ఉంటుంది.

20% ఆదాయం కార్మికుల సంక్షేమానికి!

టికెట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయం కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా, సినిమా కార్మికులకు కూడా ఉపయోగపడాలని ప్రభుత్వం ఒక కీలక నిబంధన పెట్టింది. పెరిగిన ధరల ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని ‘ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ సంక్షేమ నిధి’కి జమ చేయాలి. దీని కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ప్రత్యేక ఖాతాను పర్యవేక్షిస్తుంది.

థియేటర్లలో ఇవి తప్పనిసరి!

ప్రభుత్వం కేవలం ధరల పెంపుకే కాకుండా, సామాజిక బాధ్యతపై కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది:

అవగాహన ప్రకటనలు: థియేటర్లలో ప్రదర్శన సమయంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత మరియు నార్కోటిక్స్‌పై అవగాహన కల్పించే యాడ్స్ తప్పనిసరిగా వేయాలి.

నిఘా: జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories