రాజ్ తరుణ్ ఖాతాలో మరొక ఫ్లాప్ సినిమా

Raj Taruns  Stand Up Rahul Movie Disaster | Tollywood News
x

రాజ్ తరుణ్ ఖాతాలో మరొక ఫ్లాప్ సినిమా

Highlights

*రాజ్ తరుణ్ ఖాతాలో మరొక ఫ్లాప్ సినిమా

Stand Up Rahul: యువ హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న తన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఓటీటీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రాజ్ తరుణ్. ఒరేయ్ బుజ్జి గా, పవర్ ప్లే, అనుభవించు రాజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అందులో ఒక్క సినిమా కూడా మంచి హిట్ అవ్వలేదు.

ఇక తాజాగా తన "స్టాండప్ రాహుల్" సినిమా థియేటర్లలో విడుదల చేశాడు రాజ్ తరుణ్. కానీ ఆ సినిమా కూడా అనుకున్న విధంగా హిట్ అవ్వలేకపోయింది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించారు. ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించారు.

నందు కుమార్ మరియు భరత్ ఈ సినిమాని నిర్మించారు. టీజర్ మరియు ట్రైలర్ ల తో బాగానే ఆకట్టుకున్నప్పటికీ "స్టాన్డప్ రాహుల్" సినిమా ప్రేక్షకులను థియేటర్ల దాకా తీసుకురాలేకపోయింది. మొదటి రోజు నుంచి ఆవరేజ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా డిజాస్టర్ గా మారింది. మురళి శర్మ, వెన్నెల కిషోర్ మరియు ఇంద్రజ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories