"ది ఫ్యామిలీ మ్యాన్" డైరెక్టర్ లతో చేతులు కలపనున్న సౌత్ స్టార్ బ్యూటీ

Raj and DK will be directing web series With Samantha | Bollywood Online News
x

 రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత

Highlights

మళ్లీ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత

Samantha: సమంత ఈ మధ్య నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ ఐటమ్ సాంగ్లో బన్నీతో కలిసి డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఐటమ్ సాంగ్ తర్వాత సమంత పై ఆఫర్ లో వర్షం కురుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా బాలీవుడ్ నుండి కూడా ఈమెకు పిలుపులు అందుతున్నాయి. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే కూడా సమంతతో ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పాప్యులర్ సిరీస్ రీమేక్ కోసం ప్రముఖ బాలీవుడ్ హీరో సరసన సమంత ను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాజ్ అండ్ డీకే ప్రముఖ ఇంటర్నేషనల్ సిరీస్ "సిటాడెల్" ను హిందీలో రీమేక్ చేయనున్నారు. వరుణ్ ధావన్ ఈ సిరీస్ లో హీరోగా నటిస్తున్న నటిస్తున్నారు. ఈ సిరీస్తో మొదటిసారిగా ఓటీటీలో అడుగు పెట్టబోతున్నారు. అయితే యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కోసం సమంత హీరోయిన్ గా ఎంపిక చేసారు రాజ్ అండ్ డీకే. దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కాబోతోంది. ఇంతకుముందు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 లో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories