రాహుల్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు...ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

Rahul sipligunj
x
Rahul sipligunj
Highlights

రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కి విన్నర్ గా నిలిచాడు రాహుల్.. మెగాస్టార్...

రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కి విన్నర్ గా నిలిచాడు రాహుల్.. మెగాస్టార్ చేతుల మీదిగా టైటిల్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాకుండా యాబై లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. ఇప్పుడు రాహుల్ పేరు మోత మోగిపోతుంది.. పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు రాహుల్..

అయితే రాహుల్ ఓ గొప్ప ఛాన్స్ మిస్ అయ్యాడు. అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం అలవైకుంఠపురములో.. ఈ సినిమా నుండి విడుదలైన రెండు సాంగ్స్ , సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ బాగా హిట్టు అయ్యాయి.. ఇప్పుడు ఎవరి ఫోన్ రింగ్ టోన్స్ చూసిన ఇవే ఉంటున్నాయి. అంతలా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి ఈ పాటలు..

అయితే ఇందులోని రాములో రాముల అనే సాంగ్ ని ముందుగా రాహుల్ తో పాడించాలని సంగీత దర్శకుడు తమన్ అనుకున్నాడట..అందుకు గాను బిగ్ బాస్ బృందంతో మాట్లాడి బిగ్ బాస్ హౌస్ లో సాంగ్ ని రికార్డు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేసాడట తమన్ .. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు దీనికి ఒప్పుకోలేదట. ఈ విషయాన్నీ రాహులే స్వయంగా చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక రాహుల్ కి తన స్నేహితుడు అయిన నోయల్ చెప్పాడట..

ఆ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి కలిసి ఆలపించారు. ఈ పాటకు గాను మంచి రెస్పాన్స్ వస్తుంది. రాహుల్ ఈ పాటను మిస్ అయ్యాడు అని తెలుసుకున్న రాహుల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories