Top
logo

మళ్ళీ అటువైపు వెళ్ళను అంటున్న లారెన్స్

మళ్ళీ అటువైపు వెళ్ళను అంటున్న లారెన్స్
X
Highlights

కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత...

కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా నటుడిగా మారి ఇప్పుడు హీరోగా కూడా మారిపోయాడు. అన్నీ రంగాల్లోనూ అనుభవం ఉండాలి అనుకున్నాడో ఏమో కానీ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారాడు. 'డాన్', 'రెబెల్' వంటి పెద్ద స్టార్ల సినిమాలకు సంగీతాన్ని అందించారు కానీ అవి తీవ్ర వివాదాలకు తెర తీశాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు లారెన్స్. రాగాలు తెలిసిన నేను సంగీత దర్శకుడిగా మారితే తప్పేంటి అని ఆ రెండు సినిమాలకు సంగీత దర్శకుడిగా మారాను అని అన్నారు.

"కాని సంగీతం అంటే రాగాలు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటుంది, అదో పెద్ద సముద్రం అని తర్వాత తెలిసింది. అప్పటి నుండి మళ్లీ సంగీతం వైపు వెళ్లలేదు. ఆ రెండు సినిమాలకు సంగీతం చేసి తప్పు చేశానని అనిపిస్తూ ఉంటుంది. దర్శకత్వం గురించి తెలియకున్నా దర్శకుడిగా మారచ్చు కాని సంగీతం అలా కాదు. ఇంకెప్పుడూ సంగీతం మాట ఎత్తను" అని లారెన్స్ చెప్పుకొచ్చాడు. తాజాగా లారెన్స్ నటించిన 'కాంచన 3' ఏప్రిల్ 19 న విడుదల కానుంది. గతంలో తాను దర్శకత్వం వహించిన 'ముని', 'కాంచన', 'కాంచన 2(గంగ)' చిత్రాల్ని బీట్ చేసే విధంగా ఉంటుందని అంటున్నాడు లారెన్స్.

Next Story