'జై భీమ్' చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్.. 'సినతల్లి'కి ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రకటన

Raghava Lawrence Promises a House for Rajakannus Family After Watching Jai Bhim Movie
x

‘జై భీమ్’ చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్.. ‘సినతల్లి’కి ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రకటన

Highlights

Jai Bhim Movie: ఈ మధ్యనే సూర్య హీరోగా నటించిన "జై భీమ్" సినిమా థియేటర్లో కాకుండా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో విడుదలైన సంగతి తెలిసిందే.

Jai Bhim Movie: ఈ మధ్యనే సూర్య హీరోగా నటించిన "జై భీమ్" సినిమా థియేటర్లో కాకుండా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాని ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ వీక్షించారు. సినిమా చూసి చలించిపోయిన లారెన్స్ ఒక కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

దొంగతనం కేసులో చేయని నేరానికి పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురై ప్రాణాలు విడిచిన రాజా కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. రాజా కన్ను భార్య పార్వతమ్మ (సినతల్లికి) సొంత ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. సినతల్లి పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని లారెన్స్ తెలిపారు. ఆమె నిజాయితీ తనకు బాగా నచ్చిందని ఆమెపై ప్రశంసలు కురిపించారు. అందుకనే ఆమెకి మంచి ఇల్లు ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు లారెన్స్. ఈ నేపథ్యంలో నెటిజన్లు లారెన్స్ చేస్తున్న మంచి పని మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories