Radhe Shyam Teaser: నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు.. "రాధేశ్యామ్" టీజర్ వచ్చేసింది

Radhe Shyam Movie Teaser Released as gift to Prabhas Fans on his Birthday Today 23 10 2021
x

Radhe Shyam Teaser: నా పేరు విక్రమాదిత్య.. ఇదే నా ప్రపంచం.. "రాధేశ్యామ్" టీజర్ వచ్చేసింది

Highlights

Radhe Shyam Teaser Release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో అతను ఒక ప్రభంజనం.. "బాహుబలి" చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి...

Radhe Shyam Teaser Release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో అతను ఒక ప్రభంజనం.. "బాహుబలి" చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న 42 ఏళ్ళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పుట్టినరోజు నేడు.. "ఈశ్వర్" సినిమాలో సైకిల్ పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచం నలుమూలల విస్తరించి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు..

సాహో విడుదలై రెండేళ్లు కావొస్తున్న ప్రభాస్ సినిమా ఏ ఒక్కటి విడుదల కాకపోవడం.. కనీసం టీజర్, ట్రైలర్ లో అయిన తమ డార్లింగ్ ని కళ్లారా చూసుకోవాలని ఎన్నో రోజులుగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సుమారుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి షూటింగ్ ఇటలీలోనే జరుపుకుంది..

తాజాగా విడుదలైన ప్రోమోలో "నీ పుట్టుక, చావు, ఆనందం, బాధ అన్ని నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నా పేరు విక్రమాదిత్య..నేను దేవుడిని కాదు అంటూ చెబుతున్న ప్రభాస్.. "రాధేశ్యామ్" సినిమాలో ఒక చేతి గీతలను చూసి భవిష్యత్తు చెప్పే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో లవర్ బాయ్ గా అభిమానులను ఆకట్టుకున్నాడు.

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహారించారు.. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా "రాధేశ్యామ్" చిత్రం విడుదల కానుంది. ప్రేమించే అభిమానులు తప్ప ద్వేషించే సినీ ప్రేక్షకుడు లేని ఏకైక హీరో ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు.. ఆరు అడుగుల మంచితనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.


Show Full Article
Print Article
Next Story
More Stories