Radhe Shyam Movie Update: ఆగష్టు 1 న "రాధేశ్యామ్" టీజర్..!?

Radhe Shyam Movie Teaser Maybe Release on 01 08 2021 Friendship Day
x

రాధేశ్యామ్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Radhe Shyam Movie Update: కరోనా లాక్డౌన్ తో కొన్నిరోజులు, అనివార్య కారణాలతో కొన్నిరోజులు వాయిదా పడుతూ దాదాపుగా రెండేళ్ళ తర్వాత బుధవారం సినిమా షూటింగ్...

Radhe Shyam Movie Update: కరోనా లాక్డౌన్ తో కొన్నిరోజులు, అనివార్య కారణాలతో కొన్నిరోజులు వాయిదా పడుతూ దాదాపుగా రెండేళ్ళ తర్వాత బుధవారం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న "రాధేశ్యామ్" కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఆగష్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా రాబోతున్నట్లు ఆ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్", పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" రెండు చిత్రాలు సుమారుగా ఒకేసారి షూటింగ్ మొదలైన వెనువెంటనే షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాని విడుదల కూడా చేసిన వకీల్ సాబ్ ఇటీవల బుల్లితెరలో కూడా ప్రసారం అయిన సంగతి తెలిసిందే.

బుధవారం చివరి షెడ్యుల్ ముగించుకొన్న "రాధేశ్యామ్" చిత్రం యొక్క అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు చేసిన ట్వీట్ తో సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నారా లేక మళ్ళీ పోస్టర్ తోనే సరిపెడుతారా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమా మొదటి పాటని ఆగష్టు 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఆ చిత్ర యూనిట్. వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించిన "రాధేశ్యామ్" చిత్రంలో ప్రభాస్ కి జోడుగా పూజా హెగ్డే నటించగా "జిల్" చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ కుమార్ "రాధేశ్యామ్" తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories