Radhe Shyam-Ee Raathale Song: నీటిలో షి"కారు".. "ఈ రాతలే" రాసేందుకు వచ్చేస్తుంది

Radhe Shyam Movie Team Announced First Lyrical Song Will be out on 15 11 2021
x

"రాధేశ్యామ్" (ట్విట్టర్ ఫోటో)

Highlights

* ఈ రాతలే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల తేది ప్రకటించిన "రాధేశ్యామ్" చిత్ర యూనిట్

Radhe Shyam - Ee Raathale Song: ప్రభాస్ - పూజ హేగ్దే జంటగా కే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన రాధేశ్యామ్ చిత్రం నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించిన "రాధేశ్యామ్" నుండి "ఈ రాతలే" అనే మొదటి లిరికల్ సాంగ్ వీడియోని నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. భారీ బడ్జెట్ గా తెరకెక్కించిన ఈ చిత్రానికి యూవి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ చిత్రంలో విక్రమాదిత్యగా చేతి రాతలు చూసి భవిష్యత్తు చెప్పే ఒక పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, పూజ హెగ్డే "ప్రేరణ" అనే పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమా పూర్తి షూటింగ్ ని ఇటలీలో పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా మొదటి పాటకి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఈ పాటని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనుండగా ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, అమిత్ త్రివేది సంగీత దర్శకులుగా పనిచేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories