Tamilnadu: ఆ స్టార్ హీరోతో నయనతార సహజీవనం..సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు

Nayanathara Udayanidhi Stalin
x

నాయన తార ఫైల్ ఫోటో 

Highlights

Tamilnadu: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

Tamilnadu: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పలువురు తారలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ హద్దులుదాటుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, సినీ నటుడు రాధా రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ నయనతారపై మరోసారి నోరుపారేసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తమిళనాట రచ్చ జరుగుతోంది.

గతంలో డీఎంకే పార్టీ కోసం పనిచేసిన రాధారవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాధా రవి.. ''నయనతార గురించి చెడుగా మాట్లాడానని, మహిళల గురించి చెడుగా మాట్లాడానని గతంలో అన్నారు. పార్టీలో ఉండడానికి అర్హత లేదని తిట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించానికి మీరెవరు? నేనే బయటకు వెళ్తున్నా? మీ పార్టీలో నయనతార ఎవరు? ఉదయనిధితో నయనతార సహజీవనం చేస్తోందా? అయినా అవన్నీ నేను పట్టించుకోను.'' అని పేర్కొన్నారు.

గతంలోనూ పలు మార్లు నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాధా రవి. దెయ్యం పాత్రలు పోషించి ఎంతో మందితో తిరిగిన నయనతార.. దేవత పాత్రలు చేయడానికి ఎలా పనికొస్తుందని గతంలో ఆయన అన్నారు.అప్పడు నయనతార స్పందించారు. మీకు జన్మనిచ్చిన తల్లి కూడా మహిళే అని రాధారవిపై మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు కూడా రాధా రవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు కమల్ హాసన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాధారవి. భార్యలను కాపాడుకోలేకపోయిన కమల్ హాసన్ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విరుచుకుపడ్డారు.

మరోవైపు సినీ హీరోలు, హీరోయిన్లు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్‌కు మద్దుగా సుహాసిని ప్రచారం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా ఖుష్బూ, నమిత సహా పలువురు ప్రచారం చేస్తున్నారు. డీఎంకేలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఊపు మీదున్నారు. మరికొందరు సినీ నటులు సైతం ఎన్నికల్లో బిజీగా ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories