OTT Movie: రెండో పెళ్లి కోసం ప్లాన్ చేసి భార్యను చంపిన భర్త.. అదిరిపోయే ట్విస్టులతో మెంటలెక్కించే మూవీ..!

Raat Akeli Hai A Gripping Crime Thriller with Nawazuddin Siddiqui and Radhika Apte Shines on OTT
x

OTT Movie: రెండో పెళ్లి కోసం ప్లాన్ చేసి భార్యను చంపిన భర్త.. అదిరిపోయే ట్విస్టులతో మెంటలెక్కించే మూవీ..!

Highlights

OTT Movie: సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. డిఫరెంట్ కథలతో తెరకెక్కిన సినిమాలనే వారు ఆదరిస్తున్నారు.

OTT Movie: సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. డిఫరెంట్ కథలతో తెరకెక్కిన సినిమాలనే వారు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధిక ఆప్టే కీలక పాత్రలు పోషించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. థియేటర్ల తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దుమ్మురేపుతుంది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ‘రాత్ అకేలీ హై’.

2020 లో వచ్చిన ఈ మూవీకి హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టేతో పాటు శ్వేతా త్రిపాఠి, తిగ్మాన్షు ధులియా, శివాని రఘువంశీ, నిశాంత్ దహియా, జ్ఞానేంద్ర త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఉత్తమ నటుడి అవార్డును పొందగా, ఈ మూవీ ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. ‘రాత్ అకేలీ హై’ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతోంది.

కథలోకి ఎంట్రీ ఇస్తే.. జితిన్ ఒక పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తుంటాడు. ఇతడు తల్లితో పాటు ఒక ఫంక్షన్ కి వస్తాడు. తల్లి జితిన్ కి అక్కడే పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తుంది. పెళ్లిచూపులు ఇష్టం లేని జితిన్, ఆమెను చూసిచూడనట్లు చూస్తాడు. ఆమె కూడా ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తుంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే జితిన్ కి అతని పై ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది. రఘువీర్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని సూచిస్తాడు.

జితిన్ ఆ ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. రఘువీర్ కి ఇదివరకే పెళ్లి అయిపోతుంది. మొదటి భార్య చనిపోవడంతో రాధ అనే అమ్మాయిని సెకండ్ మ్యారేజీ చేసుకుంటాడు. ఈ పెళ్లి జరిగిన మొదటి రాత్రి లోపే అతను చనిపోతాడు. అతనికి ఒక కొడుకు, కూతురు కూడా ఉంటారు. ఏమాత్రం బాధ లేకుండా కొడుకు తిరుగుతుంటాడు. వీళ్ళ దగ్గర రిలేషన్ కి ఏమైనా సంబంధం ఉందాని ఆరా తీస్తాడు.

అయితే జితిన్ రాధను ఐదేళ్ల కిందట చూసినట్లు గుర్తు తెచ్చుకుంటాడు.ఆమెను రైలు నుంచి దూకేటప్పుడు కాపాడి తన తండ్రికి అప్పజెప్తాడు జితిన్. ఆమెను ఇక్కడికి ఎలా వచ్చావు అని ప్రశ్నిస్తాడు జితిన్. మా నాన్న వీళ్లకు అమ్మేశాడని చెబుతుంది రాధ. ఆరోజు కాపాడి తండ్రికి అప్పజెప్పిన విషయం తలుచుకొని బాధపడతాడు. అప్పటినుంచి ఆమెను ఇష్టపడడం మొదలుపెడతాడు. ఈ కేసులో ఆమెను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తాడు. చివరికి రఘువీర్ ను చంపింది ఎవరు? రాధకు, ఈ హత్యకు సంబంధం ఉందా ? లాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories