వెంకీ మామ నుంచి మరో సర్ ప్రైజ్

వెంకీ మామ నుంచి మరో సర్ ప్రైజ్
x
Raashi Khanna
Highlights

వెంకటేష్ , నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీమామ.

వెంకటేష్ , నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీమామ.. బాబీ ( కే. యస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడ‌క్షన్స్ సినిమాని నిర్మిస్తుంది. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇందులోనూ మామఅల్లుళ్ళు గానే కనిపిస్తున్నారు వెంకటేష్, నాగచైతన్య.. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ రోజు హీరోయిన్ రాశిఖన్నా పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సినిమాలో ఆమెకి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో రాశిఖన్నా చైతుతో కలిసి "నీతో కలిసి ఓ బ్యూటిఫుల్ లైఫ్ ని ఉహించుకున్నానని" అంటుంది. ఈ వీడియోకి ఆమె అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో చైతూ కార్తీక్ అనే ఆర్మీ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ సినిమాలతో మంచి హిట్లు కొట్టి మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న బాబీ ఈ సినిమాని టేకప్ చేయడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన తమన్ సాంగ్స్ కూడా శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని సురేశ్ ప్రొడ‌క్షన్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి చిత్నాన్ని నిర్మిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories