ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్న పుష్ప బృందం

Pushpa Team Spending Heavily on Promotions
x

ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్న పుష్ప బృందం

Highlights

Pushpa 2: ప్రమోషన్ల కోసం కూడా భారీ బడ్జెట్ పెడుతున్న పుష్ప నిర్మాతలు

Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "పుష్ప: ది రూల్". "పుష్ప: ది రైజ్" సినిమాకి వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి రెండవ భాగంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొకసారి అల్లు అర్జున్ ని పుష్పరాజు పాత్రలో చూడాలని అభిమానులు ఉర్రూతలుగుతున్నారు.

ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో చిత్ర బృందం ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ని మాత్రమే కాకుండా ఒక పోస్టర్ని కూడా విడుదల చేశారు. కాళికాదేవి గెటప్పులో చేతిలో గన్ను పట్టుకొని అల్లు అర్జున్ మాస్ లుక్కుతో కనిపించారు.

తాజాగా ఇప్పుడు ప్రమోషన్లలో భాగంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నార్త్ లో చాలా వరకు ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీకి వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి చాలా వరకు మార్గజాన్ల ఫ్రంట్ పేజ్ మీద షాపింగ్ మాల్స్ లేదా ప్రభుత్వం సంబంధిత కార్యక్రమాలు అవి మాత్రమే ఫోటోలు ఉంటాయి. ఇలా సినిమాకి సంబంధించిన పోస్టర్లు రావడం చాలా అరుదు. కానీ చిత్ర బృందం మాత్రం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ రాజమౌళి లాగానే కేవలం ప్రమోషన్లకి భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories