Pushpa: అప్పుడు 'ఆర్య' ఇప్పుడు 'పుష్ప'..సుకుమార్ స్కెచ్ మాములుగా లేదు

Pushpa movie Releasing On Two Parts
x

పుష్ప మూవీ 2 పార్ట్శ్ 

Highlights

Pushpa: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప'.

Pushpa: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప'. శేషాచల అడవుల్లో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇప్ప‌టికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గానే విడుదలైన 'పుష్ప' క్యారెక్టర్‌ రివీలింగ్‌ టీజర్‌ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. పుష్ప టీజ‌ర్ కి 70మిలియ‌న్ల వ్యూస్ వచ్చాయి. ఆగస్ట్‌ 13న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు సినిమా విడుదల వెనక్కి వెళుతుందని అంటున్నారు.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే .. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ డిలే అవుతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి సినిమా ఎదో ఒక కార‌ణంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతుంది. దాంతో బ‌న్ని అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉండిపోయారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శకుడు సుకుమార్, బ‌న్ని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్ప‌నున్నాడ‌ని తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక ఇదే విష‌యంపై బన్ని, సుకుమార్ అనుకున్నారంట‌. ఈ ఏడాదిలో 'పుష్ప' పార్ట్‌ 1ను విడుదల చేసి.. వచ్చే ఏడాది రెండో భాగాన్ని విడుదల చేయాలనేది ప్లాన్ నట‌... ఈ విష‌యాన్ని నిర్మాతలు దృష్టికి తీసుకెల్ల‌గా, వారు కూడా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. దీని వెనక మ‌రో కార‌ణం కూడా వినిపిస్తుంది. పుష్ప చిత్రీక‌ర‌ణ డిలే కావ‌డంతో నిర్మాత‌ల‌కు ఫైనాన్స్ ప‌రంగాను ఇబ్బందులు వ‌స్తున్నాయంట‌. అందుకే రెండు పార్ట్స్ గా విడుదల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వినికిడి. ఓటీటీ ప‌రంగా.. బాక్సాఫిసు ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల స‌మ‌స్య‌లు అధిగ‌మించి లాభాలు వ‌స్తే చాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories