Allu Arjun: ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన 'పుష్ప' ఫస్ట్‌లుక్‌

Allu Arjun: ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన పుష్ప ఫస్ట్‌లుక్‌
x
Highlights

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం 'పుష్ప'.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం 'పుష్ప'.ఈ సినిమా ఫస్ట్‌లుక్ బ‌న్ని పుట్టినరోజు సంద‌ర్భంగా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్ర‌ముఖులు నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. బ‌న్ని స‌ర‌స‌న కథానాయికగా రష్మిక నటిస్తున్నారు. ఈ పొస్ట‌ర్ లో బన్నీ మాస్‌ లుక్‌లో విభిన్నంగా దర్శనమిచ్చాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తన సినిమాల్లో హీరోలను విభిన్నంగా చూపిస్తుంటాడు సుకుమార్. ఇందులో బన్నీని డిజైన్‌ చేసిన తీరు ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టకుంటోంది. ఈ పోస్టర్‌కు విడుదలైన 24 గంటల్లో 84వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో ఒక్క రోజులో అత్యధికంగా లైక్‌ చేసిన ఫస్ట్‌లుక్‌గా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 5 భాషల్లో రాబోతోన్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories