"లైగర్" సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అంటున్నా పూరి

Puri Says that the Climax of the Movie Liger will be Very New and Unexpected
x

"లైగర్" సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అంటున్నా పూరి

Highlights

Puri Jagannadh:"పుష్ప" లాగానే "లైగర్" క్లైమాక్స్ కూడా ఉండబోతోంది అంటున్న పూరి జగన్నాథ్

Puri Jagannadh: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా "లైగర్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

"పుష్ప" క్లైమాక్స్ లాగా ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొత్తగా ఉండబోతోంది అని పూరి జగన్నాథ్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఇప్పటివరకు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎక్కడ రాని సిచ్యువేషన్ అది. ఈమధ్య నాకు పుష్ప సినిమా క్లైమాక్స్ బాగా నచ్చింది. ఎటువంటి ఫైటు లేకుండా హీరో విలన్ కూర్చొని సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా కొత్తగా అనిపించింది. లైగర్ లో కూడా హీరోకి మైక్ టైసన్ కి మధ్యలో వచ్చే సిచ్యువేషన్ కొత్తది. ఏ సినిమాలో లేనిది. సినిమా చూస్తే అర్థమవుతుంది," అని అన్నారు పూరి.

Show Full Article
Print Article
Next Story
More Stories