"లైగర్" తర్వాత కొంత సమయం కావాలని అంటున్న పూరి

Puri Says that He Wants Some Time After Liger
x

"లైగర్" తర్వాత కొంత సమయం కావాలని అంటున్న పూరి

Highlights

*"లైగర్" విషయంలో రియాక్ట్ అయిన పూరి

Puri Jagannadh: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అదే జోరుతో "లైగర్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమాకి ముందు ప్రమోషన్స్ లో భాగంగా సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ ని షేక్ ఆడిస్తాయని 200 కోట్ల నుంచే కలెక్షన్లు మొదలవుతాయని కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది చిత్ర బృందం కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం కేవలం 30 కోట్ల షేర్ ని కూడా రాబట్ట లేకపోయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత మొత్తాన్ని భర్తీ చేస్తానని పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ ఈ సినిమా లావాదేవీలకు సంబంధించిన లెక్కలు ఈనెల 30వ తారీఖు లోపు సెటిల్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లతో పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఫ్లాప్ నుంచి బయటపడేందుకు తనకి కొంత సమయం కావాలని అందుకే తన తదుపరి సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకుంటానని పూరి జగన్నాథ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories