Top
logo

పూరి నీకు ఇది నీకు భావ్యమేనా ..!

పూరి నీకు ఇది నీకు భావ్యమేనా ..!
Highlights

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి మంచి పేరుంది. సినిమా హిట్టుకి ఫ్లాప్ కి సంబంధం లేకుండా...

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి మంచి పేరుంది. సినిమా హిట్టుకి ఫ్లాప్ కి సంబంధం లేకుండా సినిమాలు చేయడం పూరి స్పెషాలిటి .. అతి తక్కువ టైంలో సినిమా చేసి అనుకున్నా టైం కి సినిమాని రిలీజ్ చేయడం కూడా పూరిలో ఉన్న మరో ప్రత్యేకత .. అయితే పూరి ఇప్పుడు వరుసగా విమర్శల పాలు అవుతున్నారు . తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది .

తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ తన అన్ని సినిమాల్లో రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు చాలా చెత్త సినిమా అని చెప్పుకొచ్చాడు . అ సినిమా స్క్రిప్ట్ అనుకున్నట్టుగా రాలేదని పూరి చెప్పుకొచ్చాడు . అయితే దీనిపైన రవితేజ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు .సినిమా హిట్టు రాగానే ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా అని ప్రశ్నిస్తున్నారు .ఇదే సినిమా ఆడియో ఫంక్షన్ లో పూరి సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు .

Next Story