Puri Jagannath: రజనీ, కమల్ రిజెక్ట్.. మరి చిరంజీవి ఏమంటారో..?

Puri Jagannath to Narrate a Story to Chiranjeevi Rejected by Kamal and Rajini
x

రజనీ, కమల్ రిజెక్ట్.. మరి చిరంజీవి ఏమంటారో..?

Highlights

పూరీ జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్‌లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Puri Jagannath: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పూరి సినిమాలు రెగ్యులర్ సినిమాలకు చాలా డిఫరెంట్‌ ఉంటుంది. పూరీ జగన్నాథ్ హీరోలను డిఫరెంట్ లుక్స్‌తో పాటు మాస్ లుక్‌లో చూపించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఆయన సినిమాలో డైలాగ్స్ రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. అయితే గతకొంతకాలంగా ఆయనకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరీ సినిమాలకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. ఆ మధ్య కాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్ టైం బాగోలేదు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు.

పూరీ సినిమాల కోసం కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పూరి తన రెగ్యులర్ రైటింగ్ టీంతో పాటు కొత్త టీంతో గోవాలో మూడు కథలను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్‌ కాగా మరో స్క్రిప్ట్ గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పూరి.. కమల్ హాసన్, రజనీకాంత్‌తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారని.. అందులో భాగంగా వారికి కథను కూడా వినిపించారని సమాచారం.

ఇప్పుడు అదే కథను కొత్త టీంతో ట్రెండీగా మార్చినట్టు తెలుస్తోంది. ఆ కథను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లబోతున్నారని టాక్. వాస్తవానికి పూరీ జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్‌లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కమల్, రజనీ రిజెక్ట్ చేసిన కథనే ట్రెండీగా మార్చి మెగాస్టార్‌కు వినిపించనున్నారని సినీ వర్గాల టాక్. ఆ కథ చిరంజీవికి నచ్చితే.. సినిమా పట్టాలు ఎక్కినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పూరి నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories