ఫ్లాప్ సినిమాతో కూడా పూరి జగన్నాథ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారా?

Puri Jagannadh to the Safe Zone With the Disaster Movie
x

ఫ్లాప్ సినిమాతో కూడా పూరి జగన్నాథ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారా?

Highlights

Puri Jagannadh: డిజాస్టర్ సినిమాతో కూడా సేఫ్ జోన్ కి వెళ్ళిన పూరి

Puri Jagannadh: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ అదే జోరుతో యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ ఫ్లాప్ అయ్యి డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది.

అయితే సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. విడుదల కి ముందే లైగర్ సినిమా చాలా వరకు బడ్జెట్ ను ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే కవర్ చేసేసింది. ఇక నిర్మాతలకి కేవలం 60 కోట్లు నష్టం మాత్రమే కలిగిందని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా మరొకవైపు హిందీ మరియు తెలుగులో ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం లైగర్ సినిమాతో ఇంకా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories