త్వరలోనే అందరి విషయాలు బయటపెడతా : పూరి

త్వరలోనే అందరి విషయాలు బయటపెడతా : పూరి
x
Highlights

ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించడంతో పూరి మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కాడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . ఇప్పటికే ఈ...

ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించడంతో పూరి మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కాడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . ఇప్పటికే ఈ సినిమా ఎనమిది రోజుల్లో 63 కోట్లు సాధించినట్లు నిర్మాత చార్మీ తెలిపారు . సినిమా యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు దియేటర్లో తిరుగుతూ ఫాన్స్ తో కలిసి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు . అయితే తాజాగా సినిమాపైన ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు పూరి జగన్నాధ్ ..

ఈ ఇంటర్వ్యూలో భాగంగా నేను చాలా విషయాల్లో భాద పడ్డానని అన్నారు . దర్శకుడుగా సంతోషంగా ఉన్నప్పటికీ నిర్మాతగా మాత్రం చాలా కష్టపడ్డాను అని పూరి చెప్పుకొచ్చాడు . ఇది నిర్మాతలకు సహజమేనని చెప్పుకొచ్చాడు . ఇంకా సినిమా రిలీజ్ కి ముందు మరింత టెన్షన్ ఉంటుందని , అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అనే భయం కూడా ఉంటుదని వెల్లడించాడు .

సినిమా హిట్టు అయితే పర్లేదు కానీ సినిమా ప్లాప్ అయితే మాత్రం బాధ మామాలుగా ఉండదని పూరి చెప్పుకొచ్చాడు . తనని ఈ క్రమంలో చాలా మంది ఇబ్బంది పెట్టారని వారి విషయాలను బయటపెడతానని పూరి చెప్పాడు . తనని ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పెట్టారో అన్ని డిపార్ట్మెంట్ లనుండి వెల్లడిస్తానని పూరి తెలియజేసాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories