పూరి మాములు టాలెంటోడు కాదుగా .. !

పూరి మాములు టాలెంటోడు కాదుగా .. !
x
Highlights

సినిమా పరిశ్రమలో ఒక్క హిట్టు వస్తేనే మన చుట్టూ చాలా మంది ఉంటారు .. అదే ప్లాప్ వస్తే మన చుట్టూ ఎవరు ఉండరు. ఇది ఇప్పటి వరకు చాలా మంది సినీ పెద్దలు...

సినిమా పరిశ్రమలో ఒక్క హిట్టు వస్తేనే మన చుట్టూ చాలా మంది ఉంటారు .. అదే ప్లాప్ వస్తే మన చుట్టూ ఎవరు ఉండరు. ఇది ఇప్పటి వరకు చాలా మంది సినీ పెద్దలు చెప్పిన మాటలు .. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సక్సెస్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది అన్నది వారి అభిప్రాయం .. మరి మంచి హిట్లు ఇచ్చిన దర్శకులు ఎక్కడున్నారు? వారికీ అవకాశాలు లేవా ?

భరత్ అనే నేను బ్లాక్ బ్లస్టర్ సినిమా తరవాత కొరటాల శివ సినిమా ఇంకా పట్టాలేక్కలేదు ... గీతాగోవిందం సినిమా తర్వాత పరుశురాం సినిమా ఏంటో తెలియడం లేదు .. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి సినిమా ఎప్పుడో తెలియడం లేదు ... భాగుమతి సినిమా తర్వాత అశోక్ ఎక్కడున్నాడో తెలియదు . రంగస్థలం సక్సెస్ తర్వాత సుకుమార్ కొత్త సినిమాపై ఓ అనౌన్సుమేంట్ లేదు. ఇక ప్లాప్ డైరెక్టర్స్ సంగతా సరేసరి .. పోనీ మన ఇండస్ట్రీలో హీరోలు లేరా అనుకుందామా అంటే మన ఇండస్ట్రీలో ఉన్నంత హీరోలు మరెక్కడా కూడా లేరు ...

కానీ ఇలా హిట్టు , ప్లాప్ లని సంబంధం లేకుండా సినిమాలు చేయడం పూరి నైజం ... ఇందులో పూరి తర్వాతే ఎవరైనా . తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా రోజులు తర్వాత హిట్టు కొట్టిన పూరి జగన్నాధ్ అ వెంటనే విజయ్ దేవరకొండని లైన్ లో పెట్టేసాడు . మరో మూడు నెలల్లో ఈ సినిమా పట్టాలేక్కనుంది కూడా .. పూరికి సక్సెస్ వచ్చాకే ఇలా అవకాశాలు వచ్చాయా అనుకుంటే అది లేదు . పూరి ప్లాప్ సినిమా చేసిన కూడా మరో హీరోతో సినిమాని స్టార్ట్ చేసేవాడు .. సో ఎంతైనా పూరి టాలెంటోడే కదా ... !

Show Full Article
Print Article
More On
Next Story
More Stories