విజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి

Puri Jagannadh is Planning a Third Film With Vijay Devarakonda
x

విజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి

Highlights

మళ్లీ విజయ్ దేవరకొండ తోనే సినిమా చేయాలనుకుంటున్న పూరీ జగన్నాథ్

Puri Jagannadh: తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా కోసం కూడా విజయ్ దేవరకొండ ని హీరో గా ఎంపిక చేసారు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా "జనగణమన". నిజానికి జనగణమన సినిమా పూరి జగన్నాథ్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఎప్పటినుంచో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్ ఎట్టకేలకు ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా మరొక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడవ సినిమాకి సంబంధించిన కథ కూడా పూరి నెరేట్ చేసేసారట. ఒకవేళ ఇదే నిజమైతే వరుసగా ఒకే హీరోతో మూడు సినిమాలు చేసిన ఘనత పూరికే దక్కుతుందేమో.

Show Full Article
Print Article
Next Story
More Stories