"లైగర్" ఎగ్జిబిటర్ల పై కేసు పెట్టిన పూరి జగన్నాథ్

puri jagannadh expressed his anger on exhibitors
x

 "లైగర్" ఎగ్జిబిటర్ల పై కేసు పెట్టిన పూరి జగన్నాథ్

Highlights

Puri Jagannadh: "ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.

Puri Jagannadh: "లైగర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల పాలయ్యారు. అప్పటినుంచి సినిమా బయర్లు మరియు ఎగ్జిబిటర్లు తమ నష్టాలను పూరి జగన్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయాలి అంటూ గొడవ మొదలుపెట్టారు.

ఇక బయర్ల పోరు తట్టుకోలేకపోయిన పూరి జగన్నాథ్ తాజాగా ఇప్పుడు వారిపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. అయితే మరోవైపు పూరి జగన్నాథ్ మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది."ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడాము. మేము చెప్పిన అమౌంట్ కి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక నెలరోజుల టైం కూడా అడిగాము. ఇస్తానని చెప్పాక కూడా మీరు ఇలా చేస్తే అసలు ఇవ్వబుద్ధి కాదు.

పరువు కోసం డబ్బు ఇద్దామనుకున్నాను కానీ నా పరువు తీస్తానంటే రూపాయి కూడా ఇవ్వను.అసలు ఎగ్జిబిటర్స్ కి నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్. పోకిరి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ నుంచి నాకు రావాల్సిన డబ్బులు చాలానే ఉన్నాయి. మరి బయర్స్ అసోసియేషన్ అది నాకు వసూలు చేసి పెడుతుందా?" అని తిరిగి ప్రశ్నించారు పూరి జగన్నాథ్. ఈ వీడియో ఆడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories