చార్మి వల్ల ఇబ్బందుల్లో పడ్డ పూరి జగన్నాథ్

Puri is in Trouble Because of Charmy
x

చార్మి వల్ల ఇబ్బందుల్లో పడ్డ పూరి జగన్నాథ్

Highlights

Charmy Kaur: చార్మి వల్లే పూరికి ఇన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయా?

Charmy Kaur: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే "లైగర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అయితే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలామంది ఈ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను ఏదో ఒక విధంగా కొంతైనా భర్తీ చేస్తారు. లైగర్ విషయంలో కూడా సినిమాని నిర్మించిన పూరి జగన్నాథ్ అదే చేయడానికి సిద్ధమయ్యారు.

కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం పూరి జగన్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ మొత్తాన్ని చెల్లించాలి అంటూ ఏకీపారేస్తున్నారు. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు ఇలా మారడానికి కారణం చార్మి అని కూడా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా విడుదలకి ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చార్మి సినిమా గురించి గొప్పలు చెబుతూ థియేట్రికల్ మరియు నాన్ థియట్రికల్ రైట్స్ తో తమకు భారీగా లాభాలు అందాయని చెప్పుకొచ్చింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తమ నష్టాలను భర్తీ చేయాలంటూ పూరి జగన్నాథ్ పై నిప్పులు జరుగుతున్నారు అని తెలుస్తోంది. ఇలా ఛార్మి కారణంగా పూరి పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories