OTT Movie: ప్రేమికులకు సాయం చేస్తానంటూ.. అమ్మాయిలతో ఘోరాలు చేసే కిరాయి కేటుగాడు

OTT Movie Chola
x

OTT Movie: ప్రేమికులకు సాయం చేస్తానంటూ.. అమ్మాయిలతో ఘోరాలు చేసే కిరాయి కేటుగాడు

Highlights

ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘చోళ’ (Chola) ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమా మీద అభిమానం ఏ మేరకు పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్ లాల్ పేర్లు మాత్రమే తెలిసిన ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుల గురించి, వారి మేకింగ్ స్టైల్ గురించి కూడా చర్చించగలుగుతున్నారు. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన మలయాళ మూవీ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రేమికులకు సహాయం చేస్తానని చెప్పి, వారిని మోసం చేసే వ్యక్తి చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా పేరు ‘చోళ’ (Chola).

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘చోళ’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వం వహించగా, జోజు జార్జ్ నిర్మాతగా వ్యవహరించారు. షాజీ మాథ్యూ, అరుణా మాథ్యూ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. జోజు జార్జ్, నిమిషా సజయన్, అఖిల్ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథలోకి వెళితే...

రవి అనే యువకుడు తన బాస్‌తో కలిసి తన ప్రేయసి సంధ్యను కలుసుకోవడానికి వెళతాడు. వీళ్లిద్దరూ కలిసి సిటీకి వెళ్లి సరదాగా గడపాలని ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా రవికి తన బాస్ కూడా ఈ ట్రిప్‌లో తోడవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సంధ్య దీనికి ఒప్పుకోకున్నా.. రవి తన బాస్ మంచివాడని ఆమెను ఒప్పిస్తాడు. సాయంత్రం అయ్యేలోపు తిరిగి వెళ్లాలని అనుకుంటాురు. కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల ముగ్గురూ కలిసి లాడ్జ్‌లో గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో రవిని బయటికి పంపించి, అతని బాస్ సంధ్యపై దాడి చేస్తాడు. ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత సంధ్య పూర్తిగా మానసికంగా కుంగిపోతుంది.

తర్వాత వీళ్లు ఊరికి తిరిగి వెళ్లేందుకు బయలుదేరుతారు. అయితే మార్గమధ్యంలో సంధ్య ఊరికి వెళ్లబోనని, అడవిలోనే ఉండిపోతానని చెప్పి, అక్కడే ఆగిపోతుంది. ఆ సమయంలోనే మరోసారి రవి బాస్ ఆమెపై అత్యాచారం చేస్తాడు. అయినా విచిత్రంగా సంధ్య అతని చుట్టూనే తిరుగుతుంటుంది. దీనిని తట్టుకోలేని రవి తన బాస్‌ను హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి సంధ్య పరిస్థితి ఏంటి? రవి తన బాస్‌ను చంపుతాడా? సంధ్య ఎందుకు తనను మోసం చేసిన వ్యక్తి చుట్టూ తిరుగుతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘చోళ’ మూవీని చూడాల్సిందే.

మలయాళ సినిమాల‌కు ప్రత్యేకమైన కథనాలు, సైకలాజికల్ థ్రిల్లర్స్‌కు పెట్టింది పేరు. ‘చోళ’ కూడా అలాంటి విభాగానికి చెందిన అద్భుత చిత్రం. ఆసక్తికరమైన కథ, భావోద్వేగాలకు గురిచేసే నటన, గంభీరమైన నేపథ్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories