20 రోజులకు రూ.30 కోట్ల రెమ్యునరేషన్.. భారతీయుడు 2 కి కలిసొస్తున్న ప్రాజెక్ట్ కే..

Project K to Benefit Bharateeyudu Movie
x

20 రోజులకు రూ.30 కోట్ల రెమ్యునరేషన్.. భారతీయుడు 2 కి కలిసొస్తున్న ప్రాజెక్ట్ కే..

Highlights

Project K: ప్రాజెక్ట్ కే మూవీ వల్ల లోకనాయకుడు కమల్ హసన్ కి రెండు రకాలుగా కలిసొస్తోందట.

Project K: ప్రాజెక్ట్ కే మూవీ వల్ల లోకనాయకుడు కమల్ హసన్ కి రెండు రకాలుగా కలిసొస్తోందట. ఒకటి 20 రోజులకు 30 కోట్ల రెమ్యునరేషన్... మరొకటి భారతీయుడు 2 కి భారీగా ప్రమోషన్. కమల్ హాసన్ కి ఎప్పుడైతే విక్రమ్ తో హిట్ పడిందో , అప్పటి నుంచి టైం బాగా కలిసొస్తోంది. ఆగిందంనుకున్న భారతీయుడు 2 షూటింగ్ రీస్టార్ట పూర్తీ కావొస్తోంది. అదనంగా ఈ సినిమాకు మరో మూవీ తోడు కాబోతోంది.

కమల్ హాసన్ విక్రమ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాక, మళ్లీ తనకి క్రేజ్, మార్కెట్ లో మైలేజ్ పెరిగాయి. అదే ఇప్పుడు మరో రెండు మూడు సినిమాల ఫేట్ మార్చేలా తయారైంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా కమల్ కి కలిసొస్తోంది. ప్రాజెక్ట్ కే లో కమల్ 20రోజులు నటించేందుకు 30 కోట్లు తీసుకుంటున్నాడట. దానికంటే ముఖ్యమైన విషయం ఈ సినిమా వల్ల భారతీయుడు 2 కి వరల్డ్ వైడ్ గా మార్కెట్ కలిసొచ్చేలా ఉందట.

ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ని వచ్చే గురువారం శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడే ప్రభాస్, కమల్, దీపికా, నాగ్ అశ్విన్ ఆన్ స్టేజ్ లో ఈ సినిమా తాలూకు చర్చల్లో పాలుపంచుకుంటారట. అక్కడే భారతీయుడు 2 గురించి కూడా కమల్ మాట్లాడే ఛాన్స్ ఉంది. సో అలా ఆ అకేషన్ ని కమల్ తన మూవీ ప్రమోషన్ కి వాడబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒక వైపు ప్రాజెక్ట్ కే, మరో వైపు భారతీయుడు 2 ఇంకో వైపు ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమా మళ్లీ పట్టాలెక్కడం.. ఇలా ప్రజెంట్ కమల్ కి టైం బాగా కలిసొస్తున్నట్టుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories