Maestro: కావాలనే తమన్నా పాత్రను హై లైట్ చేయట్లేదా?

కావాలనే తమన్నా పాత్రను హై లైట్ చేయట్లేదా?
Maestro: ఈ మధ్యనే "చెక్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో నితిన్, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన "రంగ్ దే" సినిమాతో పర్వాలేదనిపించాడు.
Maestro: ఈ మధ్యనే "చెక్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో నితిన్, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన "రంగ్ దే" సినిమాతో పర్వాలేదనిపించాడు. తాజాగా ఇప్పుడు నితిన్ "మేస్ట్రో" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మ్యూజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "అందాధున్" సినిమా కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నిటిలోనూ కేవలం నితిన్ ని మాత్రమే ఫోకస్ చేశారు. నిజానికి ఈ సినిమాలో తమన్నా ది కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర.
హిందీలో టబు నటించిన పాత్రలో తమన్నా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమా కథ చుట్టూ ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి అలాంటిది తమన్నా కి సంబంధించి కనీసం ఒక చిన్న పోస్టర్ కూడా దర్శకనిర్మాతలు విడుదల చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో తమన్నా పాత్ర గురించి దర్శకనిర్మాతలు ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. నభా నటేష్, జిషు సేన్ గుప్త మరియు నరేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
అగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్బ్రాండ్స్కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMT