"ఆర్ ఆర్ ఆర్" కొరియన్ రీమేక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నిర్మాత

Producer Sunitha Tati Made Interesting Comments About the Korean Remake of RRR Movie
x

"ఆర్ ఆర్ ఆర్" కొరియన్ రీమేక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నిర్మాత

Highlights

"ఆర్ ఆర్ ఆర్" కొరియన్ రీమేక్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నిర్మాత

Sunitha Tati: బాహుబలి సినిమా తోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సృష్టించుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మొట్టమొదటిసారిగా కలిసి నటించిన ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పిరియాడిక్ డ్రామాగా విడుదలై కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ప్రేక్షకులను అలరించారు.

తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా జోరు చాలా కాలం కొనసాగింది.తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత సునీత తాటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ మధ్యనే చేరిన సునీత తాటి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న "శాకిని డాకిని" అనే సినిమాని నిర్మించారు. నివేతా థామస్ మరియు రెజినా కసాండ్రా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది.

ఇక ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, "ప్రపంచమంతా కొరియన్ చిత్రాల వెనుక ఉంటే, కొరియన్లు 'ఆర్ఆర్ఆర్' వెనుక ఉన్నారు. రీమేక్ రైట్స్ కోసం కొరియన్ మేకర్స్ నుండి భారీ ఆఫర్ వచ్చింది. రాజమౌళికి ఇదే విషయం చెప్పినప్పుడు ఆయన ఆసక్తికర రియాక్షన్ ఇచ్చారు. నేను ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే ఉన్నాను," అని అన్నారు సునీత. తాజాగా సునీత తాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories