థియేటర్లుకు జనం వస్తారు.. ఆ సినిమా రిలీజ్ కు అనుమతివ్వకండి సీఎంకు లేఖ

థియేటర్లుకు జనం వస్తారు.. ఆ సినిమా రిలీజ్ కు అనుమతివ్వకండి సీఎంకు లేఖ
x
Highlights

తమిళ టాప్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మాస్టర్‌’. ‘ఖైదీ’మూవీ ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

తమిళ టాప్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మాస్టర్‌'. 'ఖైదీ'మూవీ ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని 'వాతి కమ్మింగ్‌' అనేపాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.అయితే లాక్‌డౌన్‌ కారణంగా 'మాస్టర్‌' సినిమా విడుదలలో నిలిచిపోయింది. అయితే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సినిమాల షూటింగులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు 'మాస్టర్‌' సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంటోంది. మరోవైపు భౌతికదూరం, ఇతర నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వనున్నట్టు టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోగానే మొదటి చిత్రంగా 'మాస్టర్‌' విడుదల చేయాలని థియేటర్‌ యజమానులు భావిస్తున్నారు. 'మాస్టర్‌' షోలతో థియేటర్లు ప్రేక్షకులతో సందడి నెలకొంటుందని భావిస్తున్నారు. కాగా.. సీనియర్‌ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్‌ ఆ రాష్ట్రంలో సీఎంకు లేఖ రాశారు. థియేటర్లు ఓపెన్ కాగానే 'మాస్టర్‌' చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతివ్వవద్దని కోరారు. విజయ్ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముంటుందని, అదే జరిగితే విజయ్‌కి ఉన్న మంచిపేరు పోతుందని కేయర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories