Kingdom: నాని కింగ్‌డమ్‌పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నరాంటే

Kingdom: నాని కింగ్‌డమ్‌పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నరాంటే
x
Highlights

Kingdom: రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్‌డమ్‌'.

Kingdom: రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్‌డమ్‌'. జర్సీ మూవీతో తన ట్యాలెంట్‌ ఏంటో నిరూపించుకున్న గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ కింగ్‌డమ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'మ్యాడ్‌ స్క్వేర్‌' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కింగ్‌డమ్‌ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నా, ముందుగానే అలా ప్లాన్‌ చేయలేదు. కథను గట్టిగా నిలబెట్టడం ఇలా చేయాల్సి వచ్చింది. రెండో భాగానికి ‘కింగ్‌డమ్‌ స్క్వేర్‌’ పెట్టాలా లేక ‘కింగ్‌డమ్‌ 2’ అనే పేరు వాడాలా అన్నది మొదటి భాగానికి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పుకొచ్చారు.

ఇక తాను ఇప్పటికే సినిమాను చూశానని, కథలో లాజిక్స్‌, స్క్రీన్‌ప్లే, యాక్షన్‌, గ్రాండియర్‌ లుక్‌ వంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా విమర్శకులకు సైతం దొరక్కుండా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు నాగ వంశీ చెప్పుకొచ్చారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మే 30న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

నాగవంశీ ప్రొడ్యూసింగ్‌లో వస్తున్న మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రల్లో, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి వినోదం అందించాలనే ఉద్దేశంతో రూపొందించామని, లాజిక్స్‌ కాకుండా ఎంజాయ్‌ చేయాలని నాగవంశీ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories