Dil Raju: ఐటీ విచారణకు హాజరైన దిల్ రాజు

Producer Dil Raju Attends Enquiry Before IT Officials
x

Dil Raju: ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్ రాజు

Highlights

Dil Raju: సినీ నిర్మాత, FDC ఛైర్మన్ దిల్‌రాజు ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. గతవారం దిల్‌రాజు ఇంట్లో ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు జరిపారు.

Dil Raju: తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళవారం ఐటీ శాఖాధికారుల ముందు హాజరయ్యారు. జనవరి చివరి వారంలో దిల్ రాజు నివాసాలు, ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో కొన్ని డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ సోదాల సమయంలోనే దిల్ రాజును విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో దిల్ రాజు మంగళవారం హైదరాబాద్ ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories