Balakrishna: బాలకృష్ణతో డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న కళ్యాణ్

Producer C Kalyan is Planning Shankaracharya Movie with Balakrishna
x

బాలకృష్ణతో శంకరాచార్య ప్లాన్ చేస్తున్న నిర్మాత సి.కళ్యాణ్

Highlights

Balakrishna: బాలకృష్ణతో శంకరాచార్య ప్లాన్ చేస్తున్న నిర్మాత సి.కళ్యాణ్

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమా ఈ మధ్యనే డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. సింహా లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అవడంతో ఈ కాంబో కి హ్యాట్రిక్ హిట్లు లభించాయి.

ఇక మరో వైపు బాలకృష్ణ చేతిలో కొన్ని బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ శంకరాచార్య సినిమా తీయాలని ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ నిర్మాత సి.కళ్యాణ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ తో శంకరాచార్య సినిమా తీయాలని అనిపిస్తుంది అని, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్న కళ్యాణ్ ప్రస్తుతం బాలకృష్ణ బాలయ్య చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు పూర్తి అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.

ఇంతకుముందు బాలకృష్ణ హీరోగా నటించిన "రూలర్" మరియు "జైసింహా" సినిమాలని నిర్మించారు సి.కళ్యాణ్ కానీ ఆ రెండు సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories