Samantha: డబ్బింగ్ విషయంలో మంకు పట్టు పట్టిన సమంత

Samantha: డబ్బింగ్ విషయంలో మంకు పట్టు పట్టిన సమంత

Rama Rao
Updated on: 12 Oct 2022 8:30 PM IST
Problems Caused By Samantha in Dubbing of Yashoda Movie
X

Samantha: డబ్బింగ్ విషయంలో మంకు పట్టు పట్టిన సమంత

Samantha: స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రమే కాకుండా సమంత "యశోద" అనే ఒక సర్వైవల్ ట్రైలర్ సినిమాలో కూడా కనిపించనుంది. నిజానికి ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ సినిమా డబ్బింగ్ వరకు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీంతో టీజర్ ని కూడా కట్ చేయటం కుదరటం లేదు.

ఒకవైపు అమెరికాకి సీక్రెట్ ట్రిప్ కి వెళ్ళిన సమంత తిరిగి వచ్చేదాకా ఈ డబ్బింగ్ పనులు ముందుకు వెళ్లవు. మరోవైపు సమంత తెలుగు ఉచ్చారణ పై కూడా కొంత నెగిటివిటీ వస్తున్న సంగతి తెలిసిందే. సమంత తమిళ ఫ్లో బాగానే ఉంటుంది కానీ తెలుగు మాత్రం అంత బాగా రాదని కొన్ని పదాల ఉచ్చారణ సమంతా కి కుదరటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతకి ఎంతగానో సెట్ అయ్యే చిన్మయి శ్రీపాదతో డబ్బింగ్ చెప్పించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

కానీ తనకి ఎంతో మంచి స్నేహితురాలు అయినా సరే సమంత మాత్రం కొన్ని అనివార్య కారణాలవల్ల చిన్మయిని వద్దు అంటుంది. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ఎవరు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదని సమంత కరాకండిగా చెప్పేస్తోందట. అసలే ఎక్స్పరిమెంటల్ సినిమా అయినప్పటికీ సమంత తానే డబ్బింగ్ చెప్పుకుంటూ మరొక ఎక్స్పరిమెంట్ చేస్తుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story