రజనీకాంత్ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్

Priyanka Mohan Acting with Rajinikanth in Talaivar 169 | Telugu Movie News
x

రజనీకాంత్ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్

Highlights

*రజనీకాంత్ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్

Priyanka Mohan: "గ్యాంగ్ లీడర్" బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఒకవైపు తెలుగు సినిమాలు మాత్రమే కాక కన్నడ, తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఈమధ్య శర్వానంద్ హీరోగా "శ్రీకారం" సినిమా తో నటించిన ఈమె శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో ప్రియాంక అరుల్ మోహన్ కి ఇంకా మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పుడు ఏకంగా సూపర్స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#తలైవర్169 సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ రజినీకాంత్ కూతురి పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. "డాక్టర్" సినిమా తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

Show Full Article
Print Article
Next Story
More Stories