logo
సినిమా

అఖిల్ సరసన నటించనున్న 'టాక్సీవాలా' భామ

అఖిల్ సరసన నటించనున్న టాక్సీవాలా భామ
X
Highlights

షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన...

షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ కు ఇప్పుడు మరొక పెద్ద అవకాశం రావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక జవాల్కర్ అక్కినేని అఖిల్ తో రొమాన్స్ చేయనుంది. వరుసగా డిజాస్టర్ లను అందుకుంటున్న అక్కినేని అఖిల్ ఈ మధ్యనే 'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో మరో ఫ్లాప్ ను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తన నాలుగవ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం ప్రియాంక జవాల్కర్ ను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుండడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి సినిమాలు నటించడం వల్ల ప్రియాంక కెరీర్ టర్న్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా అఖిల్ మరియు బొమ్మరిలు భాస్కర్ లకు కూడా కీలకంగా మారనుంది.

Next Story