Priyanka Chopra: బ‌ర్త్‌డే రోజు భర్త‌ని ముద్దుల‌తో ముంచెత్తిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైర‌ల్

Priyanka Chopra
x

Priyanka Chopra: బ‌ర్త్‌డే రోజు భర్త‌ని ముద్దుల‌తో ముంచెత్తిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైర‌ల్

Highlights

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 43వ పుట్టినరోజును ఎంతో స్పెషల్‌గా జరుపుకున్నారు. భర్త నిక్ జోనాస్, ముద్దుల కూతురు మాల్తీ మేరీ జతగా బీచ్ గెట్‌అవేలో ఈ వేడుకను ప్రియాంక గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 43వ పుట్టినరోజును ఎంతో స్పెషల్‌గా జరుపుకున్నారు. భర్త నిక్ జోనాస్, ముద్దుల కూతురు మాల్తీ మేరీ జతగా బీచ్ గెట్‌అవేలో ఈ వేడుకను ప్రియాంక గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌ను ముద్దుల వర్షంతో ముంచెత్తిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బీచ్‌లో కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతున్న ఫోటోలు అభిమానులను మంత్రముగ్ధం చేస్తున్నాయి.



ఫ్యామిలీ ఫస్ట్ అంటున్న ప్రియాంక

పనిలో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి సమయం కేటాయించడంలో ప్రియాంక ఎప్పుడూ ముందుంటారని ఈ బర్త్‌డే సెలబ్రేషన్ ద్వారా మరోసారి నిరూపితమైంది. మాల్తీ మేరీతో కడల తీరంలో ఆడుకుంటున్న ఫ్రేములు అభిమానులకు గుండె నిండేలా చేశాయి.

సినీ ప్రాజెక్టులపైనా ఫోకస్

ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు, ఇండియన్ సినిమా వైపు కూడా ప్రియాంక దృష్టి పెట్టారు. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) పేరుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటించనున్నారు. ఈ సినిమా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories