Priyanka Chopra: ఇంస్టాగ్రామ్ లో పేరు మారిస్తే జనాలు ఇంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదు

Sandeep Reddy
Published on: 22 Dec 2021 6:13 PM IST
Priyanka Chopra Clarifies Why She is Changed her name in Instagram
X

ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ (ట్విట్టర్ ఫోటో)

Priyanka Chopra: తన అందంతో పాటు అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ప్రియాంక చోప్రా సినిమాల్లో బిజీబిజీగా గడిపుతూనే తనకంటే 10 ఏళ్ళు తక్కువ వయసు ఉన్న నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని.. పెళ్ళికి ప్రేమ ముఖ్యం కాని వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది.

అటు హాలీవుడ్ లోనే కాకుండా ఇటు బాలీవుడ్ లోనూ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడాకులు తీసుకోబోతుందన్న వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ లో ప్రియాంక జోనస్ పేరులో జోనస్ ను తొలగించి చోప్రా అని పెట్టుకోవడంతో జోనస్ తో గొడవలు మొదలై విడాకులు తీసుకుంటుందని.. అందుకే తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పేరుని తొలగించిందని రకరకాల వార్తలు వినిపించాయి. అవన్నీ అసత్యపు వార్తలేనని ప్రియాంక చోప్రా తల్లి కామెంట్స్ చేసిన ప్రియాంక చోప్రా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రాకి ఈ ప్రశ్న ఎదురవగా ఆమె సమాధానమిస్తూ "నా సోషల్ మీడియా అకౌంట్లన్ని కూడా ఒక్క పేరుతోనే ఉండాలి అనుకున్నా..అందుకే ఇంస్టాగ్రామ్ కి కూడా అందుకే అలా మార్చాను తప్ప అంతకు మించి ఇంకేంలేదని.. ఇలాంటివి కూడా జనాలు సీరియస్ గా తీసుకుంటారని నాకు ఏమి తెలుసు. ఈ విషయాన్ని కూడా ఇంత పెద్దదిగా చేసి చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇది జస్ట్ సోషల్ మీడియా అంతే.. చిల్ అవుట్" అని ప్రియంకా చోప్రా క్లారిటీ ఇచ్చింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story