Bollywood: అవసరమైతే తప్ప ఎవరూ బయటకెళ్లొద్దు: ప్రియాంక చోప్రా

Priyanka Chopra Begs Everyone to Stay Home
x

Priyanka Chopra:(File Image)

Highlights

Bollywood: అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని కోరారు.

Bollywood: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. తనా,మనా బేధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ నాయకులు ఇలా ఎవ్వరినీ వదలడం లేదు ఈ మహమ్మారి. దేశవ్యాప్తంగా రెండో దశలో ప్రతీ రోజు లక్షలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ఈ మహ్మమారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టిడికి రాష్ట్రాలు ఎంత గట్టి చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. రెట్టింపు వేగంతో కరోనా వ్యాప్తి అవుతోంది.

మహారాష్ట్రలో కోవిడ్ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ నేపథ్యలో బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని కోరారు. కరోనా తగ్గిపోయిందన్న భ్రమలో గత రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ మళ్లీ విజృంభిస్తోందని విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా విలవిల్లాడుతున్న రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని, పరిస్థితి అదుపుతప్పినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నట్టు ప్రియాంక చెప్పుకొచ్చారు. మీ కోసం, మీ కుటుంబం కోసం, మన బంధువులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం దీనిని పాటించాలని సూచించారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్కులు ధరించాలని, అవసరాన్ని బట్టి చుట్టుపక్కల వారికి సాయం చేయాలని ప్రియాంక పేర్కొన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన ప్రియాంక.. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయన్నారు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే సినిమాఇండస్ట్రీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్ ఎత్తేశాక మాములు పరిస్థితులు వచ్చాయిని సంతోషపడేలోపే కరోనా సెకండ్ వేవ్ సినిమా పరిశ్రమలను అతలాకుతలం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories