అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!

Priyamani will Now Acting Balakrishna Movie | Telugu Movie News
x

అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!

Highlights

*అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!

Balakrishna Movie Heroine: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. కమర్షియల్ సినిమాలు చేయడంలో అనిల్ రావిపూడి దిట్ట. ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసి తన సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడం అనిల్ రావిపూడి కి వెన్నతో పెట్టిన విద్య. ఈమధ్యనే "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా మే 27న థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ తో తను చేస్తున్న సినిమానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో ఉంటుందట.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈమధ్యనే వెంకీ సరసన "నారప్ప" సినిమాలో హీరోయిన్ గా కనిపించిన ప్రియమణి ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా నటించనుందట. ఎప్పుడో 2009 లో "మిత్రుడు" సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఇన్నాళ్ళకు వెండి తెరపై కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories