ఇన్నేళ్లలో ఆ కోరిక తీరలేదు

ఇన్నేళ్లలో ఆ కోరిక తీరలేదు
x
Priyamani
Highlights

తెలుగు తమిళంలో ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రియమణి. పరుత్తివీరన్‌ చిత్రంలో చిత్రంలో తమిళ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుంకుంది.

తెలుగు తమిళం ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రియమణి. పరుత్తివీరన్‌ చిత్రంలో చిత్రంలో తమిళ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుంకుంది. పరుత్తివీరన్‌ చిత్రంలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డను కైవసం చేసుకుంది. ఈ అమ్మడు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు అవుతుంది. ఈ పదిహేడేళ్ల కెరీర్ లో తన కోరిక మాత్రం అలాగే ఉందని పేర్కొంది.

అయితే ప్రియమణి వివాహానం చేసుకున్న అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. టీవి రంగానికి దగ్గరగా ఉన్నారు. తెలుగులో వచ్చిన కొన్ని కార్యక్రమాకు జడ్జిగా చేశారు. తాజాగా వెబ్‌ సిరీస్‌లో బీజీగా ఉన్నారు. అమెజాన్ లో పాపులర్ అయిన ది ఫ్యామిలీమెన్‌ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని, సుచిత్రా తివారి అనే పాత్రలో పోషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ సీజన్ 2 చిత్రీకరణ జరుగుతుంది. అందులో ముంబైలో నివాసముండే ఓ తమిళ యువతిగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సమంత కుడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.



డ్రీమ్‌ రోల్‌ ఏమిటని చాలా మంది ప్రశ్నింస్తున్నారు. పడయప్పా సినిమాలో రమ్యకృష్ణ చేసిన నెగిటివ్‌ క్యారెట్టర్ నీలంబరి లాంటి పాత్రనే తన డ్రీమ్‌రోల్‌ అని వెల్లడించింది. తన గొంతు నెగిటివ్ క్యారెక్టర్స్ కు బాగుంటుందని చాలా మంది చెప్పారని తెలిపింది. అలాంటి విలన్ పాత్ర నాకు వస్తే తప్పకుండా చెస్తానని, ఆ పాత్ర కోసం ఎన్నళ్ల నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపారు.



తన కెరీర్ ప్రారంభం నుంచి భారతీరాజా, బాలుమహేంద్ర లాంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించాని ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఎక్కువ తమిళంలో సినిమాల్లో నటిచాలన్న తన కోరిక నెరవేరలేదని, ఆశ ఇప్పటికి అలానే ఉందని తెలిపింది. అయితే ప్రియామణి ప్రస్తుతం ది ఫ్యామిలీమెన్ అనే వెబ్ సిరిస్ లో నటిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితా జీవిత కథ ఆధారంగా వచ్చే తలైవి చిత్రంలో శశికళ పాత్రలో ప్రియామణి నటిస్తున్నట్లు సమాచారం. ప్రియమణి తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లోకి పెళ్లైన కొత్తలో చిత్రంతో అడుగుపెట్టింది. రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ చిత్రంలో ప్రియమణి అద్భుత నటన కనబరించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories